Sircilla SP Mahesh Bigite | వేములవాడ, జనవరి 23: రహదారి భద్రతలో భాగంగా వేములవాడ పట్టణంలో నిర్వహిస్తున్న టు కే రన్ విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. ఆయన జిల్లా పోలీస్ అధికారులతో కలిసి పోస్టర్ ను శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా వేములవాడ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో శనివారం టూ కే రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
చెక్కపల్లి బస్టాండ్ నుండి బాలానగర్ కోర్టు గ్రౌండ్ వరకు ఉదయం 7గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రజలు, యువత, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పి రుత్విక్ సాయి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐ వెంకటేశ్వర్లు, ఆర్ఐ రమేష్, సురేష్, ట్రాఫిక్ ఎస్ఐ రాజు లు ఉన్నారు.