Singareni Schools | గోదావరిఖని : సింగరేణి ఉన్నత పాఠశాలలను పచ్చదనం పెంపొందించి, పాఠశాల ఆవరణలు ఆహ్లాదకరమైన వాతరవరణం ఉండేలా ‘హరిత పాఠశాల’ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సింగరేణి ఎడ్యుకేషనల్ సెక్రెటరీ సీఎం ఎడ్యుకేషన్ గూండా శ్రీనివాస్ పేర్కొన్నారు. సింగరేణి ఉన్నత పాఠశాల, సెక్టార్ 2 ను ఆయన సోమవారం ఆకస్మిక తనికి చేశారు.
సింగరేణి ఉన్నత పాఠశాల పరిసరాలను ఉత్తమంగా ఉండేలా చూడాలని, పాఠశాల పరిసరాలు ఎటు చుసిన పచ్చదనంతో నిండి ఉండేలా విరివిగా అధిక సంఖ్యలో మొక్కలను నాటలని, పాఠశాల తరగతి గదుల వద్ద కూడా కుండీలతో మొక్కలను ఏర్పాటు చేసి ఎటు చుసిన పచ్చదనం కనిపించేలా చూడాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసారాలని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలని ఎక్కడకుడా చెత్త చెదారం లేకుండా ఉంచాలన్నారు.
పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు అడిగి తెలుసుకున్నారు, పాఠశాల పరిసరాలను పరిశీలించి అవసరమైన అభివృద్ధి పనులను చేపడతామని తెలిపారు. విధ్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, విధ్యా సంబందిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సూచనల మేరకు సింగరేణి పాఠశాలలో పచ్చదనాన్ని పెంపొందించి హరిత పాఠశాలలుగా మార్చే కార్యక్రమం చేపడుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డీజీఎం ఫారెస్ట్ కర్ణ, సీనియర్ పీఒ హనుమంత రావు, సివిల్ సూపర్ వైజర్ రాం చంధర్ పాల్గొన్నారు.