Singareni | సింగరేణి పెన్షనర్ల సమస్యలు పరిష్కరించకుంటే దశల వారీగా ఆందోళనల చేపడుతామని సింగరేణి రిటెర్డ్ కార్మికులు హెచ్చరించారు. శనివారం సెంటినరీ కాలనీలోని రాణిరుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో సింగరేణి ఆల్ రిటైర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షులు గౌతం శంకరయ్య మాట్లాడారు.
విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు అంశాలపై చర్చించి ముఖ్యంగా 11వ వేజ్ బోర్డుకు సంభందిన పెన్షన్ సవరణ చేయక పోవడం మూలంగా మాజీ కార్మికులు అనేక అవస్ధలు పడుతున్నారని తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్స్ ఇవ్వలేదనే కారణంతో కొన్ని వేల మందికి పెన్షన్లు నిలిపి వేయడం జరిగింది. త్వరలో 11వ వేజ్ బోర్డు పెన్షన్ సవరణ చేయక పోయినట్లైతే విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పట్నం సత్యనారాయణ, ఉపాధ్యక్షులు వెగోలపు మల్లయ్య, చెక్కల జవహర్, నాయకులు కొలిపాక సత్తయ్య, సిహెచ్ యాకుబ్, జగదీష్, యండి సలీం, కొండ సమ్మయ్య, చిట్టవెన రాజేశం, రహమతుల్ల, సిహెచ్ శ్రీనివాస్, మండల కిష్టయ్య, లింగన్నపేట సత్తయ్య, గట్టయ్య, ఐలయ్య, కొండపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.