ఇల్లంతకుంట, ఆగస్టు 7 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి వల్లే శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌కు కాళేశ్వరం నీళ్లు వచ్చాయ నే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని రాజన్న సిరిసిల్ల జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధంవేణు హితవు పలికారు. కాళేశ్వరంపై తప్పు డు ప్రచారం చేసిన ఆ పార్టీ నాయకులను ప్రజాక్షేత్రంలో ప్రజలే శిక్షిస్తారని మండిపడ్డారు. అన్నపూర్ణ ప్రాజెక్టుకు నీటి విడుదల చేసి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు.
శుక్రవా రం ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామ శి వారులోని మానేరు వంతెన కింద నుంచి పారుతున్న గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజరాజేశ్వర రిజర్వాయర్‌కు ఎత్తిపోతలను స్వాగతిస్తున్నానని చెప్పారు. గతంలో కాళేశ్వరం కూలేశ్వ రం అయిందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అదే ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల చేయడం చూస్తే.. ఆ మాటలు బూటకమని తెలుస్తున్నదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారన్నారని చెప్పారు. మధ్య మానేరు ప్రాజెక్టు నుంచి అన్నపూర్ణ ప్రాజెక్టుకు కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలని, మెట్ట ప్రాంతమైన ఇల్లంతకుంట, బెజ్జంకి, గన్నేరువరం మండలాల్లోని చెరువులను నింపాలని డిమాండ్ చేశారు.
లేకపోతే రైతులను ఏకం చేసి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పట్నం అశ్వి ని, మాజీ సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్, ఉప సర్పం చ్ బండారి నరేశ్, నాయకులు పట్నం శ్రీనివాస్, సతీశ్, మమత, నవీన్ కుమార్, బాబు, నర్స య్య, అంజి, మహేందర్, సాయిచరణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మధు, లచ్చయ్య, ఆదినారాయణ, అజయ్‌తోపాటు తదితరులు ఉన్నారు.