Dharmaram | ధర్మారంలో శివాలయాలు భక్తులతో కిటకిట
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కాకతీయుల కాలం నాటి శివాలయాలను కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులు దర్శించుకున్నారు. నంది మేడారం గ్రామంలోని శ్రీ అమరేశ్వర ఆలయం, రచ్చపల్లిలోని శ్రీ సాంబమూర్తి ఆలయం, ఖిలా వనపర్తిలోని శ్రీ శివాలయాలను భక్తులు దర్శించుకున్నారు.
Dharmaram | ధర్మారం, నవంబర్ 16 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కాకతీయుల కాలం నాటి శివాలయాలను కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులు దర్శించుకున్నారు. నంది మేడారం గ్రామంలోని శ్రీ అమరేశ్వర ఆలయం, రచ్చపల్లిలోని శ్రీ సాంబమూర్తి ఆలయం, ఖిలా వనపర్తిలోని శ్రీ శివాలయాలను భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని గుడిలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యోదయానికి ముందే లేచి చన్నీటి స్నానం ఆచరించిన భక్తులు నదులు, చెరువుల్లో పుణ్యస్నానాలు చేసి ఆలయాలకు చేరుకున్నారు.
భక్తులు ఉపవాస దీక్షతో ఆలయాల్లో శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం గంగాజలంతో శుద్ధి చేసి శివుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళాలతో 108 సార్లు ఓం నమఃశివాయ అని బిల్వార్చన చేశారు.అర్చకులు వేద మంత్రాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం అంటేనే దీపాల మాసం కావడంతో ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద భక్తులు ఉసిరి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులు ఇంటిలో కూడా భక్తులు శివుడి చిత్రపటానికి బిల్వ దళాలు, తెల్ల పూలతో పూజలు చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పిట్టలదొరకు పుట్టెడు కష్టాలు
Teja Sajja | హైదరాబాద్లో ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు!
ఎంపీడబ్ల్యూ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ కోసం మంత్రి సీతక్కకు వినతి
Fire Accident | ప్లాటినమ్ గోదాములో భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. Video
Minab Attack: మినాబ్ అటాక్.. ఆ ఇద్దర్నీ పట్టుకుంటాం.. ఇరాన్ తాజా వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

