పిట్టలదొరకు పుట్టెడు కష్టాలు
మా ముత్తాత జమిందార్, మా అయ్య నవాబ్, గుమ్ముల నిండా వడ్లు, ఇంటి నిండా పని మనుషులు అని నిత్యం గడప ముందుకు వచ్చి అందరిని నవ్విస్తూ ఇంటికి వెళ్లిన తర్వాత నిత్యం బాధపడుతూ దినదిన గండంగా జీవనాధారం వెల్లదీసుకుంటూ సాగుతున్న పిట్టలదొర అలియాస్ పస్తం వెంకన్న వ్యథ ఇది.
– సొంతింటి కోసం పస్తం వెంకన్న తండ్లాట
– పోలియోతో తాను, అనారోగ్యంతో భార్య
– భిక్షాటనే కుటుంబానికి జీవనాధారం
ఖమ్మం రూరల్, నవంబర్ 16 : మా ముత్తాత జమిందార్, మా అయ్య నవాబ్, గుమ్ముల నిండా వడ్లు, ఇంటి నిండా పని మనుషులు అని నిత్యం గడప ముందుకు వచ్చి అందరిని నవ్విస్తూ ఇంటికి వెళ్లిన తర్వాత నిత్యం బాధపడుతూ దినదిన గండంగా జీవనాధారం వెల్లదీసుకుంటూ సాగుతున్న పిట్టలదొర అలియాస్ పస్తం వెంకన్న వ్యథ ఇది. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ 23వ వార్డు సత్యనారాయణపురం కాలనీకి చెందిన పస్తం వెంకన్న అనే వ్యక్తి మూడు దశాబ్దాలుగా పిట్టలదొర వేషదారుడిగా ఖమ్మం జిల్లాలో సుపరిచితుడు. భిక్షాటనలో సుదీర్ఘ ప్రయాణం చేసుకుంటూ వస్తున్న వెంకన్నకు ఇప్పుడు అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, కనీసం ఉండటానికి గూడు లేక ఆ కుటుంబం అనేక ఇబ్బందులు పడుతుంది. తాను భిక్షాటన చేస్తే తప్ప కుటుంబానికి పూట గడవని పరిస్థితి. ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. తాత వారసత్వం నుండి స్వీకరించిన పిట్టలదొర వేషధారణనే వృత్తిగా మలుచుకున్న వెంకన్న నాటి నుండి నేటి వరకు నిత్యం కాలనీలలో వేషధారణతో భిక్షాటన చేస్తుంటాడు. వారాలను బట్టి దేవాలయాల ముందు అదే వేషధారణతో భిక్షాటన చేయడం అలవాటు చేసుకున్నాడు.
అనారోగ్యాల బారిన కుటుంబం
యుక్త వయసులోనే పోలియో రావడంతో వెంకన్న దివ్యాంగుడిగా మారిపోయాడు. అయినప్పటికీ కుటుంబాన్ని పోషించుకునేందుకు భిక్షాటన తప్పలేదు. సంవత్సరాల క్రితం భిక్షాటన కోసం మణుగూరు పట్టణానికి వెళ్లిన సందర్భంలో వెంకన్న భార్య వెంకటమ్మ ఆటో ప్రమాదానికి గురైంది. దీంతో ఆమెకు హైదరాబాద్లోని ప్రభుత్వ వైద్యశాలలో భారీ ఆపరేషన్లు జరిగాయి. దీంతో వెంకటమ్మ కూలీ పనులకు సైతం వెళ్లలేని దుస్థితి. ఇంటి పెద్దలు ఇద్దరు అనారోగ్యాల బారిన పడడంతో పిల్లల పోషణ గగనమయింది. నెలవారి పింఛన్ సొమ్ము, భిక్షాటన ద్వారా వచ్చే ఆదాయమే ఆ కుటుంబ జీవనాధారం.

పిట్టలదొరకు పుట్టెడు కష్టాలు
గూడు కోసం తండ్లాట
ఒకవైపు ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలో మున్సిపాలిటీగా ఏదులాపురం రూపాంతరం చెందినప్పటికీ జంగాల సామాజిక వర్గానికి చెందిన వెంకన్న కుటుంబం మాత్రం రోజురోజుకు కృంగిపోతూనే ఉంది. ఫ్లెక్సీలు, పాత బస్తాల సహాయంతో గుడారం వేసుకుని జీవనాధారం వెలదీస్తున్న కుటుంబాన్ని చూసి ప్రతి ఒక్కరు చలించిపోతున్నారు. ఇటీవల వెంకన్న కుటుంబం ఇందిరమ్మ ఇంటి కోసం తమ వంతు ప్రయత్నాలు చేశారు. తెలిసిన వారి దగ్గరికి వెళ్లి తమ ఇబ్బందులను వివరించారు. అయితే ప్రస్తుతం ఆ కుటుంబం నివసిస్తున్న నివాస స్థలం ఇందిరమ్మ ఇంటి నిర్మాణంకు సరిపడా లేకపోవడంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని స్థానికులు చెబుతున్నారు. తమ దీన పరిస్థితిని ఆలోచన చేసి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే కూలుతున్న కుటుంబానికి సర్కారు ఆసరా అయినట్లు ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. మరి ఆ దిశగా మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మానవీయ ఆలోచన చేయాల్సిందిగా పలువురు పేర్కొంటున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పిట్టలదొరకు పుట్టెడు కష్టాలు
Teja Sajja | హైదరాబాద్లో ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు!
ఎంపీడబ్ల్యూ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ కోసం మంత్రి సీతక్కకు వినతి
Fire Accident | ప్లాటినమ్ గోదాములో భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. Video
Minab Attack: మినాబ్ అటాక్.. ఆ ఇద్దర్నీ పట్టుకుంటాం.. ఇరాన్ తాజా వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

