Teja Sajja | హైదరాబాద్‌లో ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు!
Teja Sajja | టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో నిశ్చితార్థం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
Teja Sajja | టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో నిశ్చితార్థం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తేజ సజ్జా నిశ్చితార్థం వార్త ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది.హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తాజ్ కృష్ణ హోటల్లో తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, బంధువులు, స్నేహితులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమం ప్రైవేట్ వేడుకగా సాగింది. కొద్దిమంది ఆహ్వానితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు.
తేజ సజ్జా ఎంగేజ్మెంట్ వేడుకకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే హరీశ్ రావు, నటుడు శివాజీ, నిర్మాత సాహు గారపాటి, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.మరి కొద్ది రోజులలో తేజ సజ్జా ఓ ఇంటివాడు కాబోతుండడంతో పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక
బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన తేజ సజ్జా.. ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో తేజ సజ్జా క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవల తెలుగు రియాలిటీ షో ‘ది ట్రైటర్స్’కు హోస్ట్‌గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. తేజ సజ్జా ప్రస్తుతం ‘మిరాయ్ 2’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. దీనితో పాటు మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు కూడా ఆయన చేతిలో ఉన్నట్లు సమాచారం. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. సినిమాలతో వరుసగా ప్రేక్షకులను అలరిస్తున్న తేజ సజ్జా.. ఇప్పుడు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుండటంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే కాబోయే వధువు వివరాలు, వివాహ తేదీ వంటి విషయాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teja Sajja | హైదరాబాద్‌లో ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు!
ఎంపీడబ్ల్యూ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ కోసం మంత్రి సీతక్కకు వినతి
Fire Accident | ప్లాటినమ్ గోదాములో భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. Video
Minab Attack: మినాబ్ అటాక్.. ఆ ఇద్దర్నీ పట్టుకుంటాం.. ఇరాన్ తాజా వార్నింగ్
V Hanumantha Rao | ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్‌కు స్టెప్పులేసిన వీ హనుమంతరావు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

