ఎంపీడబ్ల్యూ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ కోసం మంత్రి సీతక్కకు వినతి
గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న మల్టీపర్పస్ వర్కర్స్ కార్మికుల సంక్షేమం కోసం సారపాక మేజర్ పంచాయతీ సర్పంచ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కిశోర్నాయక్ ప్రత్యేక చొరవ చూపారు. ఈ మేరకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి...
బూర్గంపహాడ్, నవంబర్ 16 : గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న మల్టీపర్పస్ వర్కర్స్ కార్మికుల సంక్షేమం కోసం సారపాక మేజర్ పంచాయతీ సర్పంచ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కిశోర్నాయక్ ప్రత్యేక చొరవ చూపారు. ఈ మేరకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను హైదరాబాద్లోని ఆమె నివాసంలో కలిసి సోమవారం అందజేశారు. పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లు ఆర్ధిక భద్రత, అత్యవసర వైద్య అవసరాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న అర్హులైన కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కిశోర్నాయక్ తెలిపారు. ఆయన వెంట తెలంగాణ పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమన్న ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంపీడబ్ల్యూ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ కోసం మంత్రి సీతక్కకు వినతి
Fire Accident | ప్లాటినమ్ గోదాములో భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. Video
Minab Attack: మినాబ్ అటాక్.. ఆ ఇద్దర్నీ పట్టుకుంటాం.. ఇరాన్ తాజా వార్నింగ్
V Hanumantha Rao | ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్కు స్టెప్పులేసిన వీ హనుమంతరావు.. వీడియో
Aakasamlo Oka Tara | ఆకాశంలో ఓ తార ట్రైలర్ విడుదల.. అమ్మాయి కలకు అండగా దుల్కర్ సల్మాన్..!
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

