Dharmaram | ధర్మారం, మార్చి 6 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో శుక్రవారం శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వొడ్నాల శంకరయ్య ఆధ్వర్యంలో ఉత్సవాన్ని నిర్వహించారు.
గురువారం ఆలయం ఆవరణలో పచ్చని పందిరి ఏర్పాటుతో ఉత్సవం ప్రారంభమైంది. శుక్రవారం శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివపార్వతులను దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు . అనంతరం ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించారు .ఈ సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.