Vemulawada | వేములవాడ, మార్చి 6 : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో శుక్రవారం అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. రాజన్న క్షేత్రంలో జరిగిన కళ్యాణం వేడుకలో అర్ధనారీశ్వరులు (హిజ్రాలు) శివుడిని వివాహం చేసుకున్నట్లుగా భావించి మంగళ సూత్రాలను చూపారు.
వివాహ వేడుక అనంతరం అర్ధనారీశ్వరులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకొని వివాహ తంతు కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అర్ధనారీశ్వరుడైన శివుడి భర్తగా భావించి రాజన్న క్షేత్రంలో జరిగే కళ్యాణ వేడుకలో ఈ తంతు అనాదిగా వస్తోంది.