 
                                                            Electric shock | పెద్దపల్లి రూరల్ అక్టోబర్ 31 : విద్యుత్ ప్రమాదంలో గొర్రెలకాపరి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గౌరెడ్డిపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ కథనం ప్రకారం.. గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన దాగేటి మల్లేశం (38) అనే గొర్రెల కాపరి రోజువారిగా గొర్రెలను కాచేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో మేతకెళ్లిన గొర్రెలు బట్టీల సమీపంలో మేస్తండగా విద్యుత్ వైర్లకు తగిలి గొర్రెపడిపోయింది.
పడిపోయిన గొర్రెను కాపాడేందుకు కాపరి మల్లేష్ యత్నిస్తుండగా అతను కూడా విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి శవాన్ని తీసేది లేదని కుటుంబ సభ్యులు తెగేసి చెప్పడంతో మృత దేహాన్ని పంచనామాకు తరలించకుండా ఎస్ఐ మల్లేష్ దర్యాప్తు చేస్తున్నారు. యాదవ సంఘం నాయకులు అక్కడికి చేరుకుని మృతుడికి న్యాయం చేయాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
                            