Kalvasrirampur | కాల్వ శ్రీరాంపూర్, నవంబర్ 12 : కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి శివారులోని శ్రీ మల్లికార్జున ఫంక్షన్ హాల్ సమీపంలో టిప్పర్ ఢీకొని ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి. కాగా మరో రెండు గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్ నుంచి కాల్వ శ్రీరాంపూర్ వైపు వస్తున్న టిప్పర్ లారీ, గొర్రెలు రోడ్డు దాటుతుండగా ఒక్కసారిగా అతివేగంతో వచ్చింది.
దీంతో టిప్పర్ గొర్రెలపై వెళ్లడంతో ఎనిమిది గొర్రెల అక్కడికక్కడే మృతిచెందాయి. కాగా రెండు గొర్రెలకు తీవ్ర గాయాలపాలయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.1.50లక్షల నష్టం వాటిల్లినట్లు గొర్రెల యజమాని పల్లపు మల్లయ్య వాపోయారు.