PACS Employees | సుల్తానాబాద్ రూరల్, జూలై 31: పీఏసీఎస్ ఉద్యోగుల కోసం చేసిన సేవలు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం ఉద్యోగుల యూనియన్ గౌరవ అధ్యక్షుడు రూప్ సింగ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో, తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు బొంగోని శంకరయ్య గౌడ్ పదవీ విరమణ అభినందన సభ కార్యక్రమాన్ని కనుకుల గ్రామంలోని ఫంక్షన్ హాల్ లో గురువారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుంచి ఉద్యోగుల సంఘం నాయకులు, తోటి ఉద్యోగులు, ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ గ్రామాల ప్రజలు, రైతులు హాజరై బొంగోని శంకరయ్య గౌడ్-లక్ష్మీ దంపతులకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రూప్ సింగ్ మాట్లాడుతూ శంకరయ్య గౌడ్ జీవో నం.44 కోసం ఎంతో కష్టపడడం జరిగిందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు కోట వీణ రాజమల్లారెడ్డి, జూపల్లి సందీప్ రావు, నాయకులు మీసా అర్జున్ రావు, లింగారెడ్డి, బ్యాంకు మేనేజర్ శశిధర్ రావు, సేల్స్ ఆఫీసర్ వంశీకృష్ణ, సహకార అధికారులు. వెంకటేశ్వర్లు, సురేందర్ రెడ్డి, శ్రీనివాస్, సీఈవోలు వల్లకొండ రమేష్, బూరుగు సంతోష్, విక్రమ్, రవీందర్ రెడ్డి, మధుమోహన్, పాలకవర్గ సభ్యులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.