కరీంనగర్ : మహా శివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ముక్కంటికి జలాభిషేకం చేసి పత్రి సమర్పిస్తున్నారు. ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. లింగమయ్య దర్శనం కోసం క్యూలైన్లలో బారులుతీరారు. ఓం నమఃశివాయ్య పంచాక్షరీ మంత్రంతో ఆలయాలు మారుమోగుతున్నాయి.
కోటిలింగాల వద్ద గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు
ముత్తారం మండలంలోని మచ్చుపేట గ్రామంలో ఉన్న అపర కాశీగా పిలువబడుతున్న బహుగుళ్ల గుట్ట వద్ద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తరలి వచ్చిన భక్తులు.
ఎల్ఎండిలోని మృత్యుంజయాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం, ఎమ్మెల్యే కవ్వంపల్లి.
వేములవాడ (Vemulawada) రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాజన్నకు కోడెలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకోవడానికి బుధవారం వేకువజామునే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దర్శించుకున్నారు.
సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల్లోని ఆలయాలలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెళ్లి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.
రాగినేడులో పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి పూజలు చేశారు.
కొండన్నపల్లి సహస్ర లింగేశ్వర ఆలయంలో పూజలు చేస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.