తిమ్మాపూర్,ఫిబ్రవరి24 : యూరియా కోసం తిమ్మాపూర్ మండల రైతులకు తిప్పలు తప్పడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ కొరత తీవ్రమవుతుందే(Urea shortage) తప్పా తీరడం లేదు. గత కొద్ది రోజులుగా సొసైటీలు, ప్రైవేటు దుకాణాల్లో యూరియా విక్రయాలు జరుగుతున్నా.. రైతులకు సరిపడా అందడం లేదు. యూరియా వచ్చిందని తెలిస్తే చాలు రైతులు పనులన్నీ వదిలేసి యూరియా వేటలో పడుతున్నారు. సోమవారం నుస్తులాపూర్ సొసైటీకి యూరియా లోడ్ వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయం నుండి లైన్లో నిల్చలేక చెప్పులను లైలును పెట్టి నీడకు కూర్చున్నారు.
ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉండడంతో ఆలస్యమైతే పంట సరిగా రాదని, దిగుబడి తగ్గుతుందని అందుకే తిప్పలు పడైన యూరియా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నమని రైతులు చెబుతున్నారు. అధికారులు సరిపడా నిల్వలు ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు రాలేదని వాపోతున్నారు. కాంగ్రెస్ పానలో అన్నదాతలకు కన్నీళ్లే మిగులుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.