Loka Bapureddy | కథలాపూర్ , జనవరి 7 : కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ర్ట మార్క్ఫెడ్మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపురెడ్డి తల్లి నర్సవ్వ అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చెల్మడ లక్ష్మీనరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బుధవారం పరామర్శించారు.
నర్సవ్వ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి వెంట జగిత్యాల మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ వొద్దినేని హరిచరణ్ రావు, ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నాగం భూమయ్య, సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.