Coal Belt | కోల్ సిటీ, ఏప్రిల్ 13: కోల్ బెల్ట్ ప్రాంతంకు కలం పట్టుకోవడం నేర్పిన తొలితరం జర్నలిస్టు గోదావరిఖనికి చెందిన కేపీ రామస్వామి జ్ఞాపకార్ధం ఆయన కుటుంబ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు ఆదివారం కేపీ రామస్వామి 25వ వర్ధంతి పురస్కరించుకొని గోదావరిఖని బస్టాండ్ సమీపంలో గల రామగుండం నగర పాలక సంస్థ మెప్మా విభాగంకు చెందిన ప్రగతి ఆశ్రమంలో జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో రామస్వామి కుమారుడు కేపీ శ్రీనివాస్ దాదాపు 15 మందికి బియ్యం, ఇతర నిత్యవసర సరుకులు అందజేశారు.
అనంతరం విఠల్ నగర్ లోని అమ్మ పరివార్ ఆనాథ పిల్లల ఆశ్రంమలో ఒకరోజు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కోల్ బెల్టు ప్రాంతంకు అక్షర ఓనమాలు నేర్పించి పత్రికా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రామస్వామి మరణం పత్రికా రంగంకు తీరని లోటుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలో ఎంతోమంది జర్నలిస్టులు ఈరోజు పత్రికా రంగంలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఆనాడు ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా పట్టిన కలంను మాత్రం ఏనాడూ విడిచిపెట్టలేదని రామస్వామి సేవలను కొనియాడారు.
వేర్వేరుగా జరిగిన కార్యక్రమాలలో రామస్వామి సతీమణి సుభద్ర, కుమారులు కేవీ శ్రీనివాస్, కేపీ రాజ కుమార్, కోడళ్లు భాగ్యలక్ష్మీ, సరిత, కుమార్తె స్రవంతి రాజు, మనవళ్లు సంజయ్ రామస్వామి, శ్రీవాస్తవ్, శ్రీఆనంత, శ్రీ అచ్యుతతోపాటు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వాహకుడు దయానంద్ గాంధీ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, జర్నలిస్టులు చంద్రశేఖర్, జనగామ గట్టయ్య, తిరుపతి రెడ్డి, కుమార్, శ్రీనివాస్ గౌడ్, దండే విజయ్, దెబ్బేట శంకర్, కరాటే శ్రీనివాస్, మూలశంకర్, శివ, శ్రీనివాస్, వంశీ పాల్గొన్నారు..