Vemula Prashanth Reddy | రుద్రంగి, నవంబర్ 28: మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లో రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మానాల పీఎసీఎస్ డైరెక్టర్ బుర్ర శంకర్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుర్ర శంకర్ గౌడ్‌ను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధారంగా అహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ మానాల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్త, నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు నాయిని రాజేశం, ఉపాధ్యక్షుడు గంగనర్సయ్య, నాయకులు భాధనవేణి రాజారాం, జూల భూమన్నలతో పాటు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.