Online courses | కోరుట్ల, ఆగస్ట్ 4: కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు మద్రాస్ ఐఐటీ ఆన్లైన్ కంప్యూటర్ కోర్సులకు ఎంపికైనట్లు పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు చాప లక్ష్మీనారాయణ సోమవారం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు ఆధునిక సాంకేతికత పరిచయం చేయడంతో పాటూ భవిష్యత్తులో విద్యార్థులను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దాలనే ఆశయంలో మద్రాస్ ఐఐటీ సహకారంతో 8 వారాల పాటూ ఆన్లైన్ స్కూల్ కనెక్ట్ పేరుతో కంప్యూటర్ కోర్సులు అందించనున్నట్లు పేర్కొన్నారు.
పాఠశాల నుంచి మొత్తం 12 మంది విద్యార్థులు ఎంపికకాగ 11 మంది విద్యార్థులకు డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌లో, ఒకరికి వెబ్ ఆర్కిటెక్చర్, డిజైనింగ్ విభాగాల్లో శిక్షణకు ఎంపికైనట్లు తెలిపారు. సోమవారం నుంచి ఆన్లైన్ ద్వారా శిక్షణ ప్రారంభించామన్నారు. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు చందా నాగరాజును నామినెట్ చేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.