Tribal groups | సారంగాపూర్, జూలై 8: మండలంలోని లచ్చనాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని లచ్చనాయక్ తండా, కింనాయక్ తండాల్లో మంగళవారం గిరిజనులు సీత్లా భవానీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తండా శివారులో ఉన్న సీత్లా భవానీ ఆలయాల్లో గిరిజనులు బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సంవృద్ధిగా కురువాలని, పాడిపంటలు బాగుండాలని, గ్రామస్తులను క్షేమంగా చూడాలని వేడుకున్నారు.
గిరిజనులు ఈ సందర్భంగా ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం వనభోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో తాజామాజీ సర్పంచ్ అజ్మిర శ్రీలతశ్రీనివాస్, గిరిజన నాయకులు మంకు నాయక్, రవి, పెరుమాండ్లు, గంగారెడ్డి, రమేష్, లక్ష్మణ్, హరిలాల్, సురేందర్, అజయ్, రామకృష్ణ, రాములు, విజయ్, సునీత, శిరీష, ప్రమీల, విజయ, అమృత, స్వప్న, తీత, లత, రోజా, భుక్య నరేంధర్, రాజేష్, భుక్య లక్ష్మణ్ నాయర్, శ్రీనివాస్, బిక్య, రాములు, నారాయణ, భీమన్న, మోహన్, నందు, శేఖర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.