Ramancha | చిగురుమామిడి, ఫిబ్రవరి 15 : చిగురుమామిడి మండలంలోని రామంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం ఉపాధ్యాయులతో కలిసి విజ్ఞాన యాత్రకు బయలుదేరారు. స్థానిక సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బయలుదేరిన విద్యార్థులు కొలనుపాక జైన మందిరం, యాదాద్రి జిల్లాలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు.
విద్యార్థులకు జైన మందిరం విశిష్టత, ఆలయాల విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. విజ్ఞాన యాత్రకు బయలుదేరడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. విజ్ఞాన యాత్రకు అన్ని సౌకర్యాలు కల్పించిన సర్పంచ్ కిషన్ రెడ్డి, వార్డు సభ్యుడు సంపత్ ను గ్రామస్తులు అభినందించారు. గ్రామానికి, విద్యార్థుల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని సర్పంచ్ తెలిపారు.