గంగాధర, ఫిబ్రవరి 28: సైన్స్ ఫెయిర్‌తో(Science fair) విద్యా ర్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు అన్నారు. గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో శుక్రవారం సైన్స్ ఫెయిర్ ను నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ విద్యార్థులు తయారుచేసిన ప్రయోగాలను వీక్షించి, అభినందించారు.
మిసైల్ మెన్ ఆఫ్ గా పేరు పొందిన ఏపీజే అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. ఉన్నత విద్యను అభ్యసించి భావి భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చదువుతోనే సమాజంలో మనిషికి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ
కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పర్రెం లక్ష్మారెడ్డి, డైరెక్టర్ గుడి అనంతరెడ్డి, ప్రధానోపాధ్యాయులు నర్సింగారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.