కరీంనగర్ కమాన్చౌరస్తా, జూన్ 14 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా పుస్తకాలు, యూనిఫాం అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా, అవి ఇంకా కార్యరూపం దాల్చలేదు. మరోవైపు పాఠశాలల ప్రారంభం నుంచే విద్యార్థులకు రెండు జతల యూనిఫాం అందించాల్సి ఉండగా అవి ఇప్పట్లో అందేటట్లు కనిపించడం లేదు. గతంలో ఇచ్చిన యూనిఫాం స్థానంలో కొత్తది ఇస్తామని ప్రకటించినా ఇంకా దానికి సంబంధించిన క్లాత్ చేరనట్లు తెలుస్తోంది.