 
                                                            పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లోని శాస్త్రీయ నైపుణ్యం వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ప్రదర్శనలను నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది. ఈ మేరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్లు నూతన ఆవిషరణలను ప్రోత్సహించే దిశగా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో ఒక అంశంపై అందుకు అనుగుణంగా ప్రయోగాలను రూపకల్పన చేయాల్సి ఉంటుంది. కాగా, ఈ యేడాది పర్యావరణానికి పెద్దపీట వేసి ప్రధాన అంశంగా, టెక్నాలజీ ఫర్ సొసైటీగా నిర్దేశించారు.
జగిత్యాల, డిసెంబర్ 18 : ఈసారి సైన్స్‌ఫేర్‌లో హెల్త్, లైఫ్ సె్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, అగ్రికల్చర్ కమ్యూనికేషన్, ట్రాన్స్‌పోర్టేషన్, కంప్యూటేషనల్ థింకింగ్‌కు అనుగుణంగా ఆవిషరణలను ప్రదర్శించవలసి ఉంటుంది. విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిషరణలతోపాటు ఉపాధ్యాయు లు సైతం నూతన బోధనోపకరణాన్ని ఆవిషరించవచ్చు. వైజ్ఞానిక ప్రద ర్శనకు విద్యార్థి వెంట ఒక గైడ్ టీచర్ హాజరు కావాలి. అందులో 6వ తర గతి నుంచి 8వతరగతి విద్యార్థులు జూనియర్ విభాగం, 9వతరగతి 10వ తరగతి విద్యార్థులు సీనియర్ విభాగంలో పాల్గొనవచ్చు. ప్రతి పాఠ శాల నుంచి మూడు లేదా ఐదు అంశాలపై ప్రదర్శన ఇవ్వవచ్చు. గూగుల్ ఫామ్ లో నమోదు చేసుకున్న విద్యార్థులు ఈ ప్రదర్శనకు అర్హులు. జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డు మానక్, బాల్ వైజ్ఞానిక ప్రదర్శన జనవరి 2024 మూడో వారంలో ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా నిర్వహించే అవకాశం ఉంది.
 
                            