Odela | ఓదెల, జూలై 11 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖను శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. సోమవారం నుంచి బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ భాస్కర్ మాట్లాడుతూ ఓదెలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు SBI బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కొత్త ఖాతాల ప్రారంభంతో పాటు వివిధ రకాల రుణాలు, ఇతర బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఓదెల మండల ప్రజల చిరకాల కోరిక అయిన SBI బ్యాంకు ఓదెలకు రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ భాస్కర్ గొల్ల, క్యాషియర్ క్రాంతి, సపోర్ట్ స్టాఫ్ సంపత్, రమణ, సర్పంచ్ కనికిరెడ్డి సతీష్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.