Korutla | కోరుట్ల గడి బురుజులు కాపాడండి.. అదనపు కలెక్టర్‌కు కోరుట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్ల వినతి
కోరుట్ల పట్టణంలోని పురాతనమైన గడి బురుజుల స్థలాలను కాపాడాలని కోరుట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)ను గురువారం కలిసి వారు వినతి పత్రం అందజేశారు.
Korutla | కోరుట్ల, ఏప్రిల్ 16 : కోరుట్ల పట్టణంలోని పురాతనమైన గడి బురుజుల స్థలాలను కాపాడాలని కోరుట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్లు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)ను గురువారం కలిసి వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే కబ్జాదారులతో కుమ్మక్కై చూసి చూడన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కోరుట్లకు తలమానికంగా ఉన్న గడి బురుజులను కబ్జాల బారి నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
నిరుపేదలు ఇల్లు కట్టుకోవాలనుకుంటే అన్ని డాక్యుమెంట్లు సరిపోలితేనే అనుమతులు మంజూరు చేసే అధికారులు గడి బురుజుల భూముల విషయంలో మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. పట్టణంలో అక్రమ వెంచర్లు, లే ఔట్లపై మున్సిపల్ అధికారులు పట్టింపు కరువైందని ఆరోపించారు. చారిత్రత్మకమైన గడి బురుజులు అన్యక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌కు వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు పొట్ట సురేందర్, మోసిన్, కొక్కెర వెంకటేష్, నాయకులు ఎలుగూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

