Doompeta | కథలాపూర్, మే 23 : కథలాపూర్ మండలం దుంపేట గ్రామానికి చెందిన దండిక అనిల్ అనారోగ్యంతో ఇటివలే చెందాడు. కాగా సౌదీలో ఉంటున్న గ్రామానికి చెందిన తోటి మిత్రులు శనివారం ఆర్థికసాయం అందించారు.
మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉండడంతో కాస్తా అసరాగా ఉండాలని సౌదీలో ఉంటున్న మిత్రులు కలిసి రూ.50 వేలు ఆర్థికసాయం అందించినట్లు వారు తెలిపారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించిన సౌదీ సేవా సమితి సభ్యులను సర్పంచ్ మల్యాల రమేశ్ అభినందించారు.