కలెక్టరేట్, జనవరి 30 : కరీంనగర్ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల తేదీ(Polling date )మార్చాలని, తెలంగాణ యువజన సంఘాల ప్రతినిధి, బీఆర్ఎస్ నాయకుడు సత్తినేని శ్రీనివాస్ కోరారు. ఈమేరకు శాసనమండలి ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా వ్యవహరిస్తున్న డీఆర్వోకు గురువారం ఆయన చాంబర్లో వినతిపత్రం అందజేశారు. ఫిబ్రవరి 26న తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవాన్ని కొలిచే మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో 27న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC elections) పాల్గొనే ఉద్యోగులు, ఓటర్లను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ తేదీ మార్చేలా ఎన్నికల సంఘానికి సిఫారసు చేయాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఈఆర్వో వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..