MLA Vijayaramana Rao | పెద్దపల్లి, సెప్టెంబర్5: సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో పెద్దపల్లి రెసిడెన్షియల్ టీచర్స్ ఆధర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఉపాధ్యాయులతో కలిసి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అమర్ నగర్ చౌరస్తా వద్ద గల సర్వేపల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక సిరి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు.
సర్వేపల్లి విద్యా రంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెసిడెన్షియల్ టీచర్స్ సంఘం సభ్యులు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.