Sardar Sarvai Papanna | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 18: సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ హాజరై పాపన్న చిత్రపటానికి నివాళులర్పించారు.
అనంతరం ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి బీసీ సంక్షేమ అధికారి, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జునరావు, గౌడ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.