Kallugeeta Karmika Sangam | చిగురుమామిడి, ఆగస్టు 18 : సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు చిగురుమామిడి మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు బండారుపల్లి చంద్రం, వివిధ కుల సంఘాలు, పలు పార్టీల నాయకులతో కలిసి సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి గౌడ్ మాట్లాడుతూ సామాన్య, మధ్యతరగతి గౌడ కుటుంబంలో పుట్టిన సర్దార్ సర్వాయి పాపన్న అప్పుడున్న మొగలాయి సామ్రాజ్యా అక్రమాలను, అన్యాయాలను చూసి నేను చనిపోయిన మంచిదే ఈ వ్యవస్థ మీద పోరాటం చేయాలనే పట్టుదలతో 12 మంది సైనికులతో పోరాటం ప్రారంభించి 12 వేల సైనికులను తయారు చేసుకుని చివరికి గోల్కొండ కోటను జయించి ఆరు నెలలు పరిపాలించన చరిత్ర సర్వాయి పాపన్నదన్నారు.
వారి పరిపాలనలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అప్పుడున్న పీడిత పన్నుల వ్యవస్థను రద్దు చేసినట్లు గుర్తు చేశారు. అప్పుడున్న బ్రిటిష్ అధికారులు సర్దార్ సర్వాయి పాపన్న వాడిన వస్తువులు, ఆయన విగ్రహం, చరిత్రను లండన్ మ్యూజియంలో ఇప్పటికీ భద్రపరిచినరన్నారు. నేటి యువత సర్వాయి పాపన్న ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
జయంతి వేడుకలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నాయకులు విజ్జగిరి ఏరుకొండ రమేష్, సదానందం, పూదరి వేణు, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు శ్రీ రామోజీ రాజకుమార్, మార్క రాజు, పరకాల కొండయ్య, వివిధ పార్టీల నాయకులు చిట్టి మల్ల రవీందర్ బెజ్జంకి లక్ష్మణ్ ఐరెడ్డి సత్యనారాయణరెడ్డి చిట్టిమల్ల శ్రీనివాస్, ఎండీ సర్వర్ పాషా, పెసరి శ్రీనివాస్, తాళ్లపల్లి కుమార్, బుర్ర సమ్మయ్య, కక్కర్ల సంపత్, కూరెళ్ల కిషోర్, నోముల పరశురాములు, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా జయంతి వేడుకలను మండలంలోని కొండాపూర్, సుందరగిరి, బొమ్మనపల్లి, తదితర గ్రామాల్లో గౌడ కులస్తులు తాటి వనంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించారు.