Sardar Sarvai Papanna Goud | ధర్మారం ఆగస్టు 18: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ గుడి ఆవరణలో బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం , సామాజిక రాజకీయ సమానత్వం కోసం పోరాడిన యోధుడు స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 375వ జయంతి వేడుకలు స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు బొమ్మగాని తిరుపతి గౌడ్, తోడేటి తిరుపతి గౌడ్, పాలకుర్తి పెద్ద రాజేశం గౌడ్, తోడేటి చందు గౌడ్,మండల గౌడ సంఘం నాయకులు నాడెం శ్రీనివాస్ గౌడ్, బొమ్మగాని సతీష్ గౌడ్, పెరుమండ్ల ప్రసాద్ గౌడ్, గుర్రం తిరుపతి గౌడ్, తోడేటి సతీష్ గౌడ్, గడ్డం మోహన్ గౌడ్, తోడేటి రవి గౌడ్, ఎరుకల ఎల్లయ్య గౌడ్, బొమ్మగాని రామస్వామి గౌడ్, బాలకృష్ణ గౌడ్ సభ్యులు పాల్గొన్నారు.