Jagityal | జగిత్యాల : మొక్కలు నాటి సంరక్షించాలని జగిత్యాల ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కల్వకుంట్ల రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కల్వకుంట్ల రామకృష్ణ మాట్లాడుతూ మొక్కలు నాటడం ద్వారా భావి తరాలకు కాలుష్యరహితమైన, ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించవచ్చని తెలిపారు.
ప్రతీ ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రమోద్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ చంద్రయ్య, శాతవాహన యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ విజయ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు సంగీతా రాణి, శ్రీలత, సుజాత, ప్రొఫెసర్ వరప్రసాద్‌తో పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.