Restaurant | జ్యోతి నగర్, మే 3: ఎన్టీపీసీ ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్ లోని శాన్వి ఫ్యామిలీ రెస్టారెంట్ నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు రామగుండం నగరపాలక సంస్థ అధికారులు రూ.10వేల జరిమానా విధించారు. ఈ మేరకు శనివారం నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు శాన్వి రెస్టారెంట్‌పై చేపట్టిన ఆకస్మిక తనిఖీలో నాణ్యతలేని ఆహార పదార్థాలను గుర్తించి యాజమానికి జరిమానా విధించారు.
అలాగే నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తున్న చంద్రబాబు కాలనీలోని దేవేందర్ కిరాణం షాపుకు రూ.2వేల జరిమానా విధించారు. ఈ తనిఖీలో సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ మధూకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.