మహాదేవపూర్ (కాళేశ్వరం) మే 31: మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26 వరకు 12 రోజులపాటు సరస్వతీ పుష్కరాలు (Saraswati Pushkaralu) జరిగాయి. త్రివేణి సంగమంలో పున్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. దీంతో రోజు రోజుకి పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ వచ్చిన భక్తులకు, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ కార్మికులు చేసిన చేసవలు కొనియాడదగినవని గ్రామానికి చెందిన చెమ్మల సుధీర్ అన్నారు. పుష్కరాలలో కాళేశ్వరం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు విలువైన సేవలు అందించారు. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శిని ఆయన సన్మానించారు. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారి సేవలు అమూల్యమైనవని, ఇలాగే మన గ్రామాన్ని కాపాడుకుంటూ ఉండాలన్నారు.