Sanitation workers | హుజురాబాద్, సెప్టెంబర్ 5: పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని శానిటేషన్ వర్కర్స్ డిమాండ్ చేశారు. శుక్రవారం హుజూరాబాద్ పట్టణం లోని ఏరియా ఆసుపత్రి లో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యం లో నిరవధిక సమ్మె నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆరు నెలల పెండింగ్ జీతాలు చెల్లించడంతో పాటు అదనంగా మరో నలుగురు శానిటేషన్ వర్కర్స్ ను కేటాయించాలని డిమాండ్ చేశారు.