Sanitation worker | హుజురాబాద్, జులై 23: ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామ పంచాయితీ లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుడైన పర్లపల్లి మల్లేష్ మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మల్లేష్ గత 15 ఏండ్లుగా గ్రామపంచాయతీలో పారిశుద్ధ కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
కాగా తన తరువాత విధుల్లో చేరిన కొందరు కార్మికులని పర్మనెంట్ చేస్తున్నారనే ఉద్దేశంతో మనస్తాపం చెంది గ్రామంలో గల వాటర్ ట్యాంక్ మీదకి ఎక్కడంతోపాటు గడ్డి మందు తాగి ఆత్మ హత్య చేసుకుంటానన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని బాధితుడు, అధికారులతో మాట్లాడారు. మల్లేష్‌కు తగిన న్యాయం చేస్తామని నచ్చజెప్పి ట్యాంకు మీద నుంచి కిందికి దింపారు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.