Timmapoor | తిమ్మాపూర్,ఏప్రిల్21: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన కళ్లెం పవన్ కొద్ది రోజుల కింద ప్రమాదం జరిగి చికిత్స పొందుతూ ఇటివల మృతి చెందాడు. కాగా రామకృష్ణ కాలనీ రెడ్డి సంఘం అధ్యక్షుడు దావు సంపత్ రెడ్డి వారి కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు. ఖర్చుల నిమిత్తం రూ.ఐదు వేలు నగదు తో పాటు 50 కిలోల బియ్యం అందజేశారు. గతంలో సైతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా రూ.5వేలు అందజేసినట్లు తెలిపారు.
భవిష్యత్తులో తమ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఎవరికి ఆపద వచ్చిన ఆర్థిక సాయం చేస్తున్నట్లు సంపత్ రెడ్డి తెలిపారు. ఆపద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన గ్రామస్తులు, దాతలకు పవన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, బేడ బుడగ జంగం కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.