Urea | మానకొండూర్ రూరల్, సెప్టెంబర్ 14: యూరియా కోసం ఇంకా అదే గోస కొనసాగుతుంది. ఆదివారం సెలవు దినం ఏటాన్న పోదాం అనుకుంటే యూరియా బస్తాలు రావడంతో మానకొండూర్ మండలం దేవంపల్లి ప్రాధమిక వ్యవసాయ సహకారం సంఘం ముందు గేటు తీయకముందే లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది.
సోసైటీ పరిధి దేవంపల్లికి దాదాపు 230 బస్తాలు రావడంతో మహిళలు, రైతన్నలు సైతం ఏవ్వరికి వారు క్యూలో నిల్చున్నారు. బస్తాలను పంపిణీ చేయగా ఇంకా దాదాపు 50-60 మందికి యూరియా బస్తాలు దొరకక నిరాశతో వెనుదిగిగారు. ఇంకా ఈ బస్తాలకు గోస తప్పట్లేదు అంటూ వెనుదిరిగారు. గీట్లాంటి గోస రాకుండా యూరియా బస్తాలు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు రైతన్నలు కోరుతున్నారు.