Appointed | జగిత్యాల, ఆగస్టు 22: రాష్ట్ర బీజేపీ అధిష్టానం పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల్లో మహిళల ప్రాధాన్యత ను పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్నది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను, నాయకులను గుర్తిస్తూ పార్టీ బలోపేతానికి చేసిన కృషిచేస్తున్న వారికి పెద్దపిట వేస్తున్నదన్నది పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇదే క్రమములో జగిత్యాల పట్టణానికి చెందిన( పద్మశాలి సంఘం డైరెక్టర్) సాంబారి కళావతి పార్టీకి చేసిన కృషిని గుర్తించిన పార్టీ అధిష్టానం ఆ పార్టీ జగిత్యాల జిల్లా కార్యదర్శిగా నియమించింది.
బీజేపీలో క్రమశిక్షణ కలిగిన మహిళా కార్యకర్తగా గుర్తింపుతో సమర్థవంతంగా బాధ్యతలను కళావతి నిర్వహించడం జరిగిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే కళావతిని బీజెపి జిల్లా కార్యదర్శి గా నియమించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తనపై ఎంతో నమ్మకంతో తన నియామకానికి కృషి చేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు మోరపెల్లి సత్య నారాయణరావు, ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, మితృలకు సాంబారి కళావతి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.