Chigurumamidi | చిగురుమామిడి, జూలై 5 : చిగురుమామిడి మండల నూతన ఎస్సైగా సాయికృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహించిన సందబోయిన శ్రీనివాస్ కరీంనగర్ ఎస్బీకి బదిలీ అయ్యారు. శ్రీనివాస్ ఎస్సైగా విధులు నిర్వహించి అనతి కాలంలోనే మండలంలో మంచి గుర్తింపు సంపాదించాడు.
కాగా నూతనంగా ఎస్సై గా బాధ్యతలు స్వీకరించిన సాయికృష్ణ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.