Sai Parayanam | జగిత్యాల, ఏప్రిల్ 07 : జిల్లా కేంద్రంలోని శిరిడి సాయి మందిరంలో గత ఎనిమిది రోజులుగా జరిగిన సాయి నామ సప్తాహం సోమవారం ఘనంగా ముగిసింది. అన్ని బ్యాచుల భక్తుల పాటల మధ్య, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయి సన్నిధిలో స్థాపించిన 1008 కలశాలలోని జలాలతో సాయినాథుని అభిషేకం నిర్వహించారు.
ఈ కళాశాలలో గోదావరి నది నుంచి తీసుకు వచ్చిన నీటితో నింపారు. అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాదం భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీష్ కుమార్, నాగుల కిషన్ గౌడ్, మార కైలాసం, రవిచంద్ర, యాదగిరి మారుతిరావు, రామకృష్ణ రావు, రామ కిషన్ రావు, కంచి కిషన్, గొల్లపల్లి శ్రీనివాస గౌడ్, సిరపరపు రాజలింగం, చంద్రశేఖర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.