Sagara sangaham | వీణవంక, ఆగస్టు 30 : వీణవంక మండలంలోని శ్రీరాములపేట గ్రామానికి చెందిన కుర్మిండ్ల స్వామి గత కొద్ది రోజుల క్రితం మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న సగర సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొడిపాక రవిసగర, కురిమిండ్ల మహేందర్ సగర, కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఏరుకొండ ప్రసాద్ గ్రామస్తులతో కలిసి మృతుడి కుటుంబాన్ని శనివారం పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుడి చిత్రపటం వద్ద నివాళులర్పించి స్వామి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే శ్రీరాములపేట గ్రామ సగర కులబంధువులు రూ.14వేలను మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయంగా అందజేశారు. ఇక్కడ శ్రీరామపేట గ్రామ సగర సంఘం అధ్యక్షుడు దేవునూరి రాజేందర్ సగర, ప్రధాన కార్యదర్శి కురిమిండ్ల మల్లయ్య సగర, నాయకులు కురిమిండ్ల సుఖేష్ సగర తదితరులు పాల్గొన్నారు.