Saddula Bathukamma | పెగడపల్లి: పెగడపల్లి మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లోని ఆలయాలు, ముఖ్య కూడళ్లు, కమ్యూనిటీ భవనాల వద్ద మహిళలలు, చిన్నారులు రంగు రంగుల పూలతో అంకరించిన బతుకమ్మలను పెట్టి పాటలు పడుతూ, ఆటలు ఆడుతూ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం శోభాయాత్రగా వెళ్లి చెరువులు, కాలువల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.