Saddula Bathukamma | గన్నేరువరం, సెప్టెంబర్29: గన్నేరువరం మండల వ్యాప్తంగా సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి మహిళలు వాడ వాడల బతుకమ్మ ఆడారు.
అనంతరం పోయిరా బతుకమ్మ మళ్ళీరా బతుకమ్మ అంటూ స్థానికంగా ఉన్న చెరువులో బతుకమ్మ ను నిమర్జనం చేశారు.మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చుపుచ్చుకున్నారు.