 
                                                            Dharmaram | ధర్మారం,అక్టోబర్ 31: ధర్మారం మండల కేంద్రంలో శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్-2025 కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువకులకు 2-కే రన్నింగ్ పోటీలను నిర్వహించారు.
స్థానిక ఎస్సారెస్పీ కాలువ సమీపం వద్ద ధర్మారం ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. యువకులు పోటాపోటీగా ఈ రన్నింగ్ కాంటెస్టలో పాల్గొన్నారు. నంది మేడారం సివిల్ కోర్టు వరకు ప్రారంభించిన స్థలం వద్దకు యువకులు చేరుకున్నారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన వారిని ఎస్సై అభినందించారు. స్థానిక లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
 
                            