godavarikhani | కోల్ సిటీ , ఏప్రిల్ 19: గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ పురస్కరించుకొని శనివారం గోదావరిఖనిలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది . రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ క్రైస్తవుల్లో ఉత్సాహం నింపారు. ర్యాలీ ప్రారంభం నుంచి మొదలుకొని నగరంలోని ప్రధాన కూడల వెంట సాగిన ర్యాలీలో ఆయన పాల్గొని అందరితో కలిసి నడక సాగించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
కాగా ఇంటర్ డినామినేషన్ పోస్టల్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద చేపట్టిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంకు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజాకూర్, మాజీ శాసన సభ్యులు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందరు హాజరై ముందుగా శాంతికి చిహ్నంగా పావురాలను ఎగురవేశారు. అనంతరం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ చర్చిల పాస్టర్లు, క్రైస్తవ మతస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రధాన చౌరస్తా మీదుగా నగరంలోని వివిధ ప్రధాన కూడళ్ల వెంట సాగిన వ్యాలీలో క్రైస్తవులు, యువతీ యువకులు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ మాట్లాడుతూ ఆరోగ్యానికి వ్యాయామం, వాకింగ్ ఎంతో ముఖ్యమన్నారు. మానవాళి రక్షణ కోసం ఈ లోకంలో జన్మించారనీ, అందరినీ సమానంగా చూడాలని, ప్రేమ, కరుణ భావాలతో మెలగాలని సూచించారు. ర్యాలీలో పాల్గొన్న క్రైస్తవ సోదరులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ చర్చిల పాస్టర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధిక సంఖ్యలో క్రైస్తవులు, యువత పాల్గొన్నారు.