Safe and secure | మల్లాపూర్ : మండలంలోని ముత్యంపేటలో సోమవారం మెట్పల్లి టీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ దేవరాజు గ్రామస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు ప్రయాణంలో భద్రతతో పాటు సురక్షిత గమ్యాన్ని చేరవచ్చు అన్నారు. అలాగే ప్రైవేట్ వాహనాలను హైదరాబాదు లాంటి దూర ప్రయాణాలకు రెంటుకు తీసుకువెళ్తే కనీసం రూ.ఐదువేల ఖర్చవుతున్నాయని అదే ఆర్టీసీ ఎక్స్ప్రెస్, లగ్జరీ బస్సులలో హైదరాబాద్ వెళ్తే ఒక్కొక్కరికి రూ.400 నుండి రూ.500 టికెట్కు అవుతున్నాయన్నారు.
నూతనంగా ఖానాపూర్ నుండి వయా ఆర్మూర్ హైదరాబాద్ కు లగ్జరీ బస్సు ప్రారంభించామని ప్రయాణికులు ఈ బస్సును వినియోగించుకోవాలన్నారు. ఖానాపూర్ నుండి ఉదయము ఐదు గంటలకు వయా ఓబులాపూర్ మీదుగా మెట్పల్లి వచ్చి వయా ఆర్మూర్ నుండి హైదరాబాద్ వరకు నాన్ స్టాప్ గా వెళ్తుందని తెలిపారు.