Ramagundam | కోల్ సిటీ, నవంబర్ 22: కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా… ఎవరైనా.. బయట చెత్తను కాల్చినట్లయితే సమాచారం ఇస్తే వారికి రూ.5 వేల జరిమానా విధించనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ జే అరుణశ్రీ హెచ్చరించారు. చెత్తను కాల్చడం వల్ల పర్యవరణంపై దుష్ర్పభావం పడుతుందని ప్రజల్లో అవగాహన కల్పించడానికి జిల్లా నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ ను ఆమె శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చెత్తను తగలబెట్టడం నేరమని ఇందుకు రూ.5 వేల జరిమానాతో పాటు బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ కార్ప్స్ కోఆర్డినేటర్, తెలంగాణ పర్యావరణ విద్య బ్రాండ్ అంబాసిడర్ గూళ్ల అంజన్ కుమార్, నగర పాలక సంస్థ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్ పాల్గొన్నారు.