Robbery | చిగురుమామిడి, జూలై 24: మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో బుధ వారం రాత్రి రెండు చోట్ల దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామంలోని కనపర్తి రవీంద్ర చారి గోల్డ్ స్మిత్ షాపులో బుధవారం రాత్రి 11 గంటల వరకు ఉండి ఇంటికి వెళ్లి పడుకోగా, తెల్లవారుజామున షాపు తలుపులు పగలగొట్టి ఉన్నాయి. వెళ్లి చూసేసరికి అందులో ఉన్న నాలుగు తులాల బంగారం,వెండి వస్తువులు, నగదు కలిపి సుమారు రూ.4.50 లక్షలు దొంగలించబడ్డాయి.
అదే గ్రామంలో గుజ్జుల రాజేశ్వరి ఇంట్లో దొంగతనంకు పాల్పడి సుమారు రూ.50 వేల విలువైన బంగారం, ఇతర వస్తువులను దొంగలించారు. పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై సాయి కృష్ణ క్లూస్ టీం తో దొంగతనం పాల్పడిన ఇళ్లను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయి కృష్ణ తెలిపారు.